విజయవాడ శివారు ప్రాంతాలలో కాల్ మనీ వేధింపులు విజృంభిస్తున్నాయి. అవసరానికి అప్పు అడిగి తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నారు. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నగరంలోని పలువురు రౌడీ షీటర్లు వడ్డీ వ్యాపారులకు అండగా ఉంటున్నారు. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగడం.. ఇంట్లో సామగ్రి తీసుకెళ్లడం వీరి నైజం. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.