గర్బిణి పట్ల నిర్లక్ష్యం వహించిన అమెరికా పోలీసులకు కోర్టు షాక్ ఇచ్చింది. సాండ్రా క్వినోన్స్ అనే గర్భిణి ఖైదీగా ఉంది. జైల్లోనే ఆమెకు ఉమ్మనీరు లీకయ్యింది. పోలీసులు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆలస్యం చేయడంతో పాటు, దారి మధ్యలో కాఫీ తాగారు. దీంతో ఆమె బిడ్డను కోల్పోయింది. దాంతో సాండ్రా.. కేసు పెట్టడంతో.. కోర్టు విచారణ పూర్తి చేసి, పోలీసులు ఆ ఖైదీకి రూ.3కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.