ఈఏపీసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. JNTU పరిధిలోని కాలేజీల గుర్తింపు పూర్తి కాకపోవడంతో, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలలో జాప్యం నెలకొనడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వెబ్ ఆప్షన్ల నమోదును కూడా వాయిదా వేయగా.. ఇప్పటివరకు 79,864 మంది విద్యార్థులు EAPCET కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.