కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మరో 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి జీఎం సరూరీ వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో 2019, ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పురుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేరుస్తామని ఆయన తెలిపారు.