పిల్లల ఏడుపును బట్టి తండ్రి వయస్సు తెలిసిపోతుందని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. టోహోకు యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ నోరికో ఒహ్సుమీ నేతృత్వంలోని పరిశోధన బృందం చేసిన అధ్యయనం ఇప్పుడు అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్ద వయసులో తండ్రికి పుట్టిన శిశువు స్వరం ఎలుకను పోలి ఉంటుందని, అలాగే చిన్నవాడికి పుట్టిన బిడ్డ స్వరంలో కూడా తేడా కనిపించిందని అధ్యయనం పేర్కొంది.