కర్ణాటకలోని చిత్రదుర్గలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఓ స్వామీజీ తమపై అత్యాచారం చేశాడని బాలికలు వాపోయారు. మైసూరు జిల్లా బాలల సంక్షేమ కమిటీకి జరిగిన దారుణాలను వివరించారు. హాస్టల్ వార్డెన్ రశ్మి తమను స్వామీజీ గదికి తీసుకెళ్లేదని చెప్పారు. చిత్రదుర్గలో న్యాయం జరగదని మైసూరు వచ్చినట్లు చెప్పారు.దీంతో ఆ స్వామీజీ, అతడికి సహకరించిన వారిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.