ఆసియా కప్ మెగా టోర్నీ రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ సాయంత్రం మ్యాచ్. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. రోహిత్ సేన-బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ ప్రేక్షకులను కమ్మేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించడం ఖాయం. దీనికి కారణాలు లేకపోలేదు. దుబాయ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది ఛేజింగ్ జట్టుకు అధిక శాతం విజయాలను అందిస్తుంది. దుబాయ్ స్టేడియంలో ఇప్పటి వరకు 74 మ్యాచ్‌లు జరగ్గా.. రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమిండియా గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 39. శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో అదే రుజువైంది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ శ్రీలంకను 105 పరుగులకే పరిమితం చేసింది. ఆ లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే సాధించింది. కేఎల్ రాహుల్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌తో తాము ఓడిపోయిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో తాను మొదట బ్యాటింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తమను తాము సవాలు చేసుకోవడమేనని వ్యాఖ్యానించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలంటే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని అన్నాడు.