ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోట కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే

Life style |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 09:57 AM

ఆకుకూరలను తినడం వలన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మనకు సమృద్ధిగా లభిస్తాయని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఆకు కూరలలో తోటకూర కూడా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. తోటకూరను ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తోటకూరను వేపుడుగా కంటే కూరగా చేసుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
- తోట కూర తినడం వల్ల ఎక్కువ శాతం ప్రొటీన్లు శరీరానికి లభిస్తాయి.
- బరువు తగ్గాలనుకునేవారు తోటకూరను తమ డైట్ లో భాగం చేసుకోవాలి.
- జీర్ణశక్తిని పెంపొందించడంలో తోటకూర చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాల కారణంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకు నెట్టివేయబడుతుంది.
- తోటకూరలో క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్,కాపర్ , సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కారణంగా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చేస్తాయి.
- ఎముకలు బలంగా ఉండేలాగా తోటకూర సహాయపడుతుంది. ఇక తోటకూర విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ తో పాటు కె, విటమిన్ బి12, బి6 వంటివి కూడా లభిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com