వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వ నిబంధనలను రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తప్పుబట్టారు. గణేష్ ఉత్సవాలపై ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని సీఎం జగన్కు లేఖ రాశారు. పండుగను స్వేచ్చగా, ఆనందంగా జరుపుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చవితి వేడుకల్లో DJ సౌండ్ సిస్టమ్, సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. నిబంధనల పేరుతో మండపాల నిర్వాహకులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.