సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబరు 1న మిలియన్ మార్చ్, సీఎం ఇల్లు ముట్టడికి వీరు పిలుపునిచ్చారు. పార్వతీపురం ఎన్జీవో హోంలో సంఘ రాష్ట్ర నాయకుడు జీవీఆర్‌ఎస్ కిషోర్‌కు శనివారం పోలీసులు ముందస్తు నోటీసులను జారీ చేశారు. 'సీఎం ఇంటి ముట్టడి ' కి వెళ్తే చర్యలు తప్పవన్నారు. ఈ చర్యలకు భయపడేది లేదని వివిధ సంఘాల నాయకులు తెలిపారు.