ఉత్తర ప్రదేశ్లోని మహ్మద్ హాపూర్ అనే వ్యక్తి ఆరుగురు ఆడపిల్లలు. ఒక రోజు తన కూతురు రేష్మ భోజనం వడ్డించడంలో ఆలస్యమవడంతో వాగ్వాదానికి దిగాడు. అయితే రేష్మ కోపంగా బదులిచ్చింది. దాంతో కోపోద్రిక్తుడైన మహ్మద్ కూతురిని గడ్డి కోసే కొడవలిని తీసుకుని నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సెక్షన్ 302 కింద కేసే నమోదు చేసి అరెస్టు చేశారు.