వినాయకచవితికి ప్రభుత్వం భారీగా ఆంక్షలు విధిస్తోందని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. ఏపీ రాష్ట్ర పోలీసులు, ఇతర శాఖల ఆంక్షలను నిరసిస్తూ ఏపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. వినాయకచవితి వేడుకలపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. యువత, భక్తులు ఈ ఆందోళనలో భాగస్వామం కావాలని పిలుపునిచ్చింది.