గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చరఖాపై నూలు వడకడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. దేశం కోసం ఖాదీ అనే సందేశాన్ని ఇవ్వడం బాగానే ఉందని, అయితే జాతీయ జెండాకు మాత్రం చైనాలో తయారైన పాలిస్టర్ ఉపయోగించారని విమర్శించారు. ఆయన మాటలు మరియు పనులు ఎప్పటికీ సరిపోలడం లేదు అని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.