నెల్లూరులో దారుణం జరిగింది. వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. కృష్ణారావు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. కృష్ణారావు, సునీత అశోక్ నగర్లో ఉంటున్నారు. కృష్ణారావుకు క్యాటరింగ్ వ్యాపారంతో పాటు హోటల్ కూడా ఉంది. తన వ్యాపారం చూసుకుని రాత్రి పొద్దుపోయాక ఇంటికి వస్తాడు. అయితే ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు.. గదిలో నిద్రిస్తున్న సునీతను కర్రతో కొట్టి చంపారు. అనంతరం డబ్బు, బంగారం కోసం ఇంటింటా వెతికారు.అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన కృష్ణారావు వారిని చూసి గట్టిగా అరిచాడు. అయితే దుండగులు కృష్ణారావును గొంతుకోసి హత్య చేశారు. ఇదంతా శనివారం రాత్రి జరిగింది.ఆదివారం ఉదయం కృష్ణారావు, సునీత మృతదేహాలను స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.