ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలకు నిబంధనల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తగదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిబంధనల పేరుతో ఉత్సవ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని, కమిటీలను బెదిరించే ధోరణి మానుకోవాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం జగన్కు లేఖ రాశారు.