నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని రాపూరు-పెంచలకోన జాతీయ రహదారిలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాపూరుకు సమీపంలోని తిక్కన పార్కు వద్ద ఉన్న రోడ్డులో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు రాపూరు నుంచి ఆత్మకూరు వాహనంలో వెళుతుండగా రెండు చిరుతలు రోడ్డు దాటుతూ కనిపించాయి. సమీపంలోని టోల్ ప్లాజాలో ఆయన సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు.