సంక్షేమ పథకాల కేరాఫ్ అడ్రస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ పక్క రాష్ట్రాల సైతం మెచ్చుకునే విధంగా మన ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి అందేలా మన ప్రభుత్వం డిబిటి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్, గ్రామపార్టీ అధ్యక్షులు దర్శనాల కమలేష్, షేర్ మొహమ్మద్ పేట గ్రామ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.