యూపీలోని నోయిడాలో ఆదివారం ట్విన్ టవర్స్ కూల్చివేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ టవర్స్‌ను నిర్మించిన సూపర్ టెక్ లిమిటెడ్ సంస్థ స్పందించింది. భూమి కొనుగోలు, నిర్మాణ ఖర్చులు, వడ్డీలు అన్నీ కలుపుకుని తమకు రూ.500 కోట్లు నష్టమని సంస్థ ఛైర్మన్ ఆర్కే ఆరోరా వెల్లడించారు. బ్యాంకులకు ఏళ్ల తరబడి 12 శాతం వడ్డీ చెల్లించామన్నారు. కూల్చివేతకు తాము ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థకు రూ.17.5 కోట్లు చెల్లించామని తెలిపారు.