దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన నోయిడాలో అక్రమ నిర్మాణం ట్విన్ టవర్స్ సెకన్ల వ్యవధిలోనే నేలమట్టమైపోయింది. అయితే ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత వెనుక యూబీఎస్ టియోటియా, ఎస్కే శర్మ, రవి బజాజ్, ఎంకే జైన్ అనే నలుగురు సీనియర్ సిటిజన్ల సుదీర్ఘ న్యాయపోరాటం ఉంది. ఈ నలుగురు అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులో దాదాపు పదేళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడారు. ఆర్థిక స్థోమత లేక విరాళాలు సేకరించి మరీ కోర్టు చుట్టూ తిరిగారు.