అందరి కళ్లుగప్పి, జూ ఎన్‌క్లోజర్‌లో ప్రవేశించిన వ్యక్తిని ఓ సింహం చంపింది. ఈ ఘటన ఘనా రాజధాని అక్రాలోని 'జూ'లో తాజాగా జరిగింది. సిబ్బంది అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా, ఓ సందర్శకుడు జూ ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు అధికారులు వెల్లడించారు. సింహం దాడి చేయడంతో అతడు చనిపోయాడని, అయితే సింహం దాని పిల్లలు క్షేమంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ఫారెస్ట్రీ కమిషన్ పేర్కొంది.