గత రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కోసం బ్యానర్ లను నిలిపివేస్తున్నాం అని రాష్ట్ర సీఎం జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయం పై టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందిస్తూ.... ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా?
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా? అని ప్రశ్నించారు. ఆమె అన్నట్లుగానే త్వరలో అనగా సెప్టెంబర్ 2 వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావటం విశేషం.