ప్రజలను అసౌకర్యానికి గురి చేసే బహిరంగ మద్యపానంపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS అధికారులను ఆదేశించారు. బహిరంగంగా మద్యం సేవించడం నిషేధమన్నారు. చట్టరీత్యా నేరమన్నారు.
ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే తాగుబోతులను అదుపులోకి తీసుకుని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, నడకదారులు,పార్కులు,వ్యాపార దుకాణ సముదాయాలు,శివారు ప్రాంతాలు మరియు వల్నరబుల్ ఏరియాలలో దాడులు నిర్వహించి పబ్లిక్ న్యూసెన్స్ కింద చర్యలు తీసుకోవాలన్నారు.