ఈ నెల 31న వినాయక చవితి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు భక్తులు. అయితే, వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయాలంటే అధికారులు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ స్పందించారు. రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుములు వసూలు చేయట్లేదని, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల వద్ద చట్టపరమైన అనుమతులు తీసుకుంటే చాలన్నారు.