పల్నాడు జిల్లా,బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులాపురం గ్రామంలో పోలీస్ శాఖ మరియు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యా శాఖామాత్యులు శ్రీమతి విడదల.రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ డా.త్రివిక్రమ వర్మ ఐపీఎస్ ,జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్.లోతేటి ఐఏఎస్ ,జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మరియు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా. బ్రహ్మనాయుడు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ వైద్య శిబిరంలో గుండె,మెదడు,నరాలు,ఎముకలు,స్త్రీల సమస్యలు,కన్ను,పన్ను, చర్మ,శ్వాసకోశ సంబంధ వ్యాధులు,మూత్రశయ సమస్యలు,బీపీ మరియు షుగర్ మొదలగు 24 రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి సుమారు 40 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్య పరీక్షలు అందించారు. వినుకొండ నియోజక వర్గంలో మారుమూల గ్రామమైన రావులాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమైన విషయమని,దీనికి కృషి చేసిన పోలీస్ శాఖ మరియు రెడ్ క్రాస్ సంస్థ వారికి,వైద్య పరీక్షలు అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్లకు అతిధులు తమ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
గత నెల రోజులుగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాలని మా పోలీస్ వారు ప్రణాళిక రూపొందించామని, నేడు ఆచరణలోకి రావడం సంతోషంగా ఉందని, దీనికి సహకారం అందించిన రెడ్ క్రాస్ సంస్థ వారికి,వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్లకు ఎస్పీ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.