ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతముగా వాహన తనిఖీలు, బస్ స్టేషన్ రైల్వే స్టేషన్స్ మరియు లాడ్జిల వద్ద పోలీసు యంత్రాంగం తనిఖీలు నిర్వహించారు. CPS ఉద్యోగులు సెప్టెంబర్ 1 వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ మిలియన్ మార్చ్ నేపధ్యంలో ఏలూరు జిల్లా SP శ్రీ రాహుల్ దేవ్ శర్మ IPS యొక్క ఆదేశాలపై అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రహదారులపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద, హోటల్స్, లాడ్జ్ లలో,బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ లో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీ నిర్వహించారు.
చట్ట వ్యతిరేకంగా ప్రకటించిన మిలియన్ మార్చ్ మరియు సిఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను విరమించుకోవలసిందిగా తెలియజేయడమైనదని, ఎవ్వరైనా ఆంక్షలు అతిక్రమించి విజయవాడ CPS మిలీనియం మార్చ్ కి హాజరైతే వారిపై చట్ట ప్రకారం 143,427,282,341,506 120(B), రెడ్ విత్ 149 ఐపిసి మరియు రైల్వే చట్టం 141,146,147 మరియు 151 ప్రకారం కేసులు నమోదు చేస్తారు, ముందు జాగ్రత్త చర్యగా సిపియస్ ఉద్యోగులకు 149 సి.అర్.పి.సి నోటిసులు కూడా అందజేయడమైనదని జిల్లా ఎస్పీ తెలియ చేసినారు.