ముప్పాళ్ళ: మండలంలోని గ్రామాల్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో నిర్వాహకులు పోలీసు నిబంధనలు పాటించాలని ఎస్ఐ ఎం. పట్టాభిరామయ్య తెలిపారు. వినాయక మండపం ఏర్పాటుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి పోలీస్ స్టేషన్ లో అనుమతి పొందాలన్నారు. కమిటీ సభ్యుల గుర్తింపు కార్డులను పోలీస్ స్టేషన్లో అందించాలని చెప్పారు. సత్తెనపల్లి డీఎస్పీ నుంచి మైక్ పర్మిషన్ తీసుకోవాలన్నారు.