తాడికొండ: నియోజకవర్గంలో వైసీపీ వర్గ పోరుకు అడ్డుకట్ట పడడం లేదు. పరిస్థితి రోజు రోజుకు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. ఇంచార్జి నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. డొక్కా మాణిక్యంకు బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి రెండు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులానే ఉంది. సోమవారం డొక్కా పర్యటించనుండటంతో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.