గుంటూరు: రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వినాయక ఉత్సవాలకు అనుమతులు లేవు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో విగ్రహాల ధరలు భారీగా పెరగడం, మండపాల ఏర్పాటుకు అధికారులు నిబంధనలు కఠినంతరం చేయడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు విద్యుత్ శాఖకు వెయ్యి వోల్టులకు రూ. 2395లు, 1500 వోల్టులకు రూ. 3145లు చెల్లించాల్సి వస్తోందని చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa