కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో భర్త భార్యపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వరలక్ష్మికి 13 ఏళ్ల కిందట బున్నీ అలి యాస్ అంజితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో అంజి నిత్యం మద్యం తాగొచ్చి భార్యను హింసిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మద్యం తాగొచ్చి కత్తి తీసుకుని ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం పగలగొట్టాడు. అడ్డు వచ్చి భార్యపై కత్తితో దాడి చేయగా ఆమెకు గాయమైంది. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.