అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఆదివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. నిందితుడు హూస్టన్ సిటీలోని ఓ ఇంటికి నిప్పంటించాడు. దీంతో అందులో ఉన్నవారు బయటకు పరుగులు పెడుతుండగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడిని ఆఫ్రికన్-అమెరికన్‌గా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa