రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామపంచాయతీ రెవెన్యూ పొలంలోని సర్వే నెంబర్ 8 లో ఉన్న కాట్రేవుడు, పశువుల బీడు, స్మశానం స్థలాలను గుర్తించి ప్రత్యామ్నాయంగా వేరేచోట చూపించి అందుకు సంబంధించిన వారికి పరిహారం ఇవ్వాలని సిఐటియు అన్నమయ్య జిల్లా నాయకులు చంద్రశేఖర్ సూచించారు. గ్రామస్తుల అభ్యంతరాలమేరకు కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నప్పటికీ, జిల్లా అధికారులు డివిజన్ అధికారులు మండల అధికారులు పరిహారం ఎలా పంపిణీ చేస్తారని సిఐటియు నాయకులు చంద్రశేఖర్ విమర్శించారు.