చిత్తూరు జిల్లా, పలమనేరు: వినాయక చవితిని పురస్కరించుకొని పలమనేరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో నిబంధనలు పాటించని నిర్వాహకులపై చర్యలు తప్పవని పలమనేరు డిఎస్పి గంగయ్య హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎవరి నుంచి అయినా బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు తప్పవన్నారు. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే పెట్టాలన్నారు. లౌడ్ స్పీకర్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడరాదు అన్నారు.