చిత్తూరు, పూతలపట్టు: ఐరాల మండలం బిజెపి అధ్యక్షుడు ఎం కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కాణిపాకం ప్రముఖ కల్యాణ మండపంలో ఆదివారం బిజెపి ఐరాల మండలం పతాధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి పంచాయతీలోని గ్రామాలను సందర్శిస్తూ కేంద్రం ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజల కోసం 2014 నుండి ఇప్పటివరకు ప్రజల సంక్షేమానికి దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకి కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.