గుమ్మలక్ష్మీపురం మండలంలో గల శికలబాయి గ్రామంలో ఉదయం 40 లీటర్ల నాటుసారాతో గిరిజన వ్యక్తి పట్టుబడినట్లు ఎల్విన్‌పేట షణ్ముఖ రావు తెలిపారు. నాటుసారాపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో సారాతోపాటు తయారీకి వినియోగించే సామాగ్రితో వ్యక్తిని పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టు లో హాజరుపరుస్తామని, ఎవరైనా నాటుసారా అమ్మిన , కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.