చిత్తూరు, పలమనేరు: వీ. కోట మండలంలోని ముదరం దొడ్డి గ్రామ పంచాయతీకి సంబంధించిన మద్దిమాకులపల్లి సచివాలయ రైతులకు సబ్సిడీ బిందు సేద్య పరికరాలు గల వాహనాన్ని వైస్ ఎంపీపీ తమిమ్ ఆదివారం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వాహనాన్ని పచ్చజెండా ఊపి మదరం దొడ్డి పంచాయతీ కి తరలించారు.