శత్రుచర్ల పల్లవిరాజు తీరుపై కురుపాం నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని మిడిమిడి జ్ఞానంతో ఆమె పరువును ఆమె దిగజార్చుకుంటున్నారని, రాజకీయంగా ఎంతో చరిత్ర ఉన్న శత్రుచర్ల కుటుంబ పరువును నడిరోడ్డుపైకి లాగే ప్రయత్నం చేస్తున్నారని గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షుడు కుంబురుక. ధీనమయ్యా ఆగ్రహం వ్యక్తం చేసారు. మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చరిత్రను సృష్టించిన కుటుంబానికి స్వయానా ఆమె ఆడపిల్లని ఆమె పెదనాన్న శత్రుచర్ల. విజయరాజు ఎన్నో కీలక పదవులు చేసారని, ఆమె తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజు కురుపాం నియోజకవర్గంలో శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారని, ఆమె వదిన పాముల. పుష్పశ్రీ వాణి అదే కుటుంబానికి కోడలిగా వచ్చి రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి ఉపముఖ్యమంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించారని అన్నారు. రాజకీయంగా ఎన్నో చరిత్రలను సృష్టించిన అటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ శత్రుచర్ల పల్లవిరాజు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడో పుట్టి పెరిగి కోడలిగా వచ్చిన పాముల పుష్పశ్రీవాణి ఆమె నిరాడంబరడతో, సాధారణ వైఖరితో, నాయకత్వ లక్షణాలతో కురుపాం నియోజకవర్గ ప్రజల హృదయాలలో ఒక మంచి ముద్రను వేసుకుని ఆ కుటుంబ పరువును రెట్టింపు చేస్తే అదే కుటుంబంలో పుట్టిన పల్లవిరాజు ఆ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె చేస్తున్న దిగజారుడు రాజకీయాలు ప్రజలు గమణిస్తున్నారని ఇకనైనా ఆమె అవివేక వైఖరిని మార్చుకోకపోతే ఉన్న విలువ కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు.