సులభతర సేవల కోసం వాట్స్ ఆప్ (WhatsApp) బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్ల 'ఎస్బిఐ' తెలిపింది. దీని ద్వారా సింపుల్ గా బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ పొందొచ్చని పేర్కొంది. అందుకు ముందుగా వాట్సాప్ లో +919022690226 నంబర్ కు 'హాయ్' అని మెసేజ్ చేయాలని పేర్కొంది. ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ పొందే ఆప్షన్స్ వస్తాయని, వాటిపై క్లిక్ చేసి మీకు కావాల్సిన సమాచారం పొందవచ్చని SBI తెలిపింది.