ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వదర ప్రవాహాం కొనసాగుతుంది. దీంతో సోమవారం ఉదయం నుంచి డ్యాం 10 గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.20 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.80 టీఏంసీలకుగానూ 210.99 టీఏంసీలుగా నమోదైంది.