దేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. కాగా, ఈ బలవన్మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర 22 వేల సూసైడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇక తమిళనాడులో 18,925, మధ్యప్రదేశ్ 14,965, పశ్చిమబెంగాల్ 13,500, కర్ణాటక 13,056 బలవన్మరణాలు సంభవించినట్లు నివేదికలో తెలిపింది.