ఇరాక్‌లో షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ దేశంలో హింస చెలరేగింది. దీనిపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో రాజధాని బాగ్దాద్‌లో ఆందోళనకారులపై సోమవారం సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు.