దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 458 పాయింట్ల లాభంతో 58,431 వద్ద.. నిఫ్టి 144 పాయింట్ల లాభంతో 17,457 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.