రైతుల ఆదాయాన్ని 2022 నాటి కల్లా రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. అందులో సోలార్ స్కీమ్ (కుసుమ్ స్కీమ్) ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతులు వారి పొలంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ కంపెనీలు దీనికి గానూ రైతులకు అద్దె చెల్లిస్తాయి. లేదంటే మీరే సోలార్ కరెంట్‌కు కంపెనీలకు విక్రయించుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది.
రైతులు వారి పొలాన్ని సోలార్ ప్యానెల్స్ కోసం అద్దెకు ఇస్తే కంపెనీలు ఎకరాకు రూ.లక్ష చెల్లిస్తాయి. అయితే దీనికి అగ్రిమెంట్ ఉంటుంది. 25 ఏళ్ల పాటు పొలాన్ని అద్దెకు ఇవ్వాలి. అంటే కంపెనీలు మీకు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ కోసం అద్దె చెల్లిస్తూనే వస్తాయి. 25 ఏళ్ల తర్వాత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల అద్దె లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి. https://solarrooftop.gov.in/