తిరుపతి: సీపీఎస్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నితే సహించేది లేదని ఎస్పీ పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని సెప్టెంబర్ ఒకటో తేదీ ఛలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నిరసన మాటున కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు.