మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితంకాని మెట్రోపాలిటన్ నగరంగా ఢిల్లీ నిలిచింది. గతేడాది నగరంలో సగటున రోజూ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడి జరిగింది. ఈ మేరకు ఎన్సీఆర్బీ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 2021లో ఢిల్లీలో మహిళలపై 13,892 నేరాలు జరిగాయి. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ముంబై(5,543 నేరాలు), బెంగళూరు(3,127 నేరాలు) ఉన్నాయి. మహిళల కిడ్నాప్‌నకు సంబంధించి ఒక్క ఢిల్లీలోనే 3,948 కేసులు రికార్డయ్యాయి.