చట్ట విరుద్ధంగా సినిమాల పైరసీకి పాల్పడుతున్న 1,788 వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో నెలలు శ్రమించి, కోట్లు వెచ్చించి నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని 'కోబ్రా' చిత్ర నిర్మాత చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం పిటిషనర్ వాదనలు విన్న కోర్టు.. పైరసీ సైట్లపై నిషేధం విధించింది.