స్వదేశంలో జింబాబ్వేతో రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. మరోవైపు వచ్చే నెలలో భారత్తో జరిగే టీ20 సిరీస్కు కూడా మార్ష్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మార్ష్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చాడు. రెండో వన్డే బుధవారం జరగనుంది.