హొళగుంద: మహిళల పట్ల లింగ వివక్షతను రూపుమాపాలని సీనియర్ న్యాయవాది సావిత్రి, టీఎన్ఎస్ఎఫ్ నేత రామాంజనేయులు, ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. మంగళవారం హొళగుంద జూనియర్ కళాశాలలో 'ఓ చెల్లెమ్మ జర జాగ్రత్త' అనే అంశంపై విద్యార్థినీలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మాయిలపై అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై లింగ వివక్షత చూపరాదని, ఆడపిల్లలనే వివక్ష వద్దని కోరారు.