ఫిరంగిపురం ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు స్థానిక విజ్ఞానపురానికి చెందిన సాలె రాజేష్, ప్రియాంకకు కోన్నాళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ఈనెల 29న మధ్యాహ్నం రాజేష్ ఇంట్లో ఉండగా తలుపుకు గడియపెట్టి ప్రియాంక బయటకు వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఆమె భర్త రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.