వినాయక చవితి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు. తమ ప్రయత్నాలలో అడ్డంకులు తొలిగి, చేపట్టిన పనులు విజయవంతం కావాలని భక్తులు విఘ్నేశ్వరునికి ప్రార్థిస్తారన్నారు. ఈ ముఖ్యమైన పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో భక్తి, సంతోషాలతో జరుపుకుంటారన్నారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సామరస్యాలతో కూడిన జీవితాన్ని గడపడానికి దేవుడు దీవెనలు ఇవ్వాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa