హోంగార్డుగా పనిచేస్తున్న నాగలక్ష్మి భర్త చనిపోయారు. తనకు ఇద్దరు సంతానం. బంటుమిల్లి ఎక్సైజ్ , ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్ దాదాపు నాలుగేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేస్తున్నాడు. నాగలక్ష్మి తన కుమార్తె వివాహం కోసం దాచుకున్న రూ.2.50 లక్షలు తన పదోన్నతికి అవసరం అని తీసుకున్నాడు. కాలం గడుస్తున్నా వివాహం చేసుకోపోగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేసింది.